Gandhiji Municipal Corporation High School - Vijayawada

4.4/5 based on 8 reviews

Contact Gandhiji Municipal Corporation High School

Address :

1 Town, Kaleswara Rao Market, Tarapet, Vijayawada, Andhra Pradesh 520001, India

Postal code : 520001
Categories :

s
sirisha Neelam on Google

U
Uday M (Udaynagas07) on Google

S
Shaik Saniya Anjum on Google

V
Venkata Narasimha Rao Devalraju on Google

A
Ashok S on Google

అనిల్ నాయక్ మూడ్ on Google

c
chalapaka prakash Channel on Google

1900 సంవత్సరంలో స్వాతంత్య్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న తరుణంలో, జాతీయోద్యమాన్ని ఉధృతస్థాయిలో నడిపిస్తున్న గాంధీజీకి జేజేలు పలుకుతున్న సందర్భం! బెజవాడ వన్‌టౌన్‌లో చర్చి ఆఫ్‌ సౌత్‌ ఇండియా (సీఎస్‌ఐ) వారి సహృదయంతో పదెకరాల పైబడిన స్థలాన్ని, భవనాన్ని పేదపిల్లలకు ఉచితంగా మున్సిపాలిటీకి అప్పగించింది. జాతీయోద్యమ స్ఫూర్తితో గాంధీ పేరుతోనే 'గాంధీజీ మునిసిపల్‌ హైస్కూల్‌'ను ఇక్కడ 1914లో స్థాపించారు. అద్భుతమైన ఆర్కిటిక్ట్‌ నైపుణ్యానికి ప్రతిరూపం గాంధీజీ మునిసిపల్‌ హైస్కూల్‌. బ్రిటీష్‌ పాలకుల నిర్మాణశైలిలో, ఇంగ్లీష్‌ లెటర్‌ 'యూ' ఆకారంలో కోటను తలపిస్తూ భవనాన్ని ఏర్పాటు చేశారు. కారు రాయి, గునుగ సున్నంతో ఏర్పాటుచేసిన ఈ భవనానికి వందేళ్లు దాటినా చెక్కు చెదరకపోవడం అబ్బురపరుస్తున్నది. అప్పట్లో 12వ తరగతి వరకు విద్యాబోధన జరిగేది. కృష్ణాజిల్లాలో నాడు నందిగామ, వన్‌టౌన్‌లోని గాంధీజీలో మాత్రమే 12వ తరగతి వరకు చదివే అవకాశం ఉండేది. 1986 వరకు ఇక్కడ 12వ తరగతి వరకు విద్యా బోధన జరిగింది. తర్వాత ప్రాథమిక, మాథ్యమిక, ఉన్నత విద్యా వ్యవస్థలను విడదీయడంతో పదో తరగతి వరకే పరిమితమైంది. పన్నెండవ తరగతి స్థాయి కావడంతో స్కూల్‌కు అపారమైన ల్యాబ్‌ సంపత్తి లభించింది. ఇప్పటికీ పురాతన స్కెలిటెన్‌, జంతు అవశేషాలున్నాయి. ప్రస్తుతం 500 మంది విద్యార్థులతో నడపబడుతున్న ఈ హైస్కూల్‌లో 1993 నుంచి తెలుగు, ఇంగ్లీష్‌ మీడియాలలో నడుస్తున్నది. మునిసిపల్‌ హైస్కూల్‌ అయినా విద్యార్థుల ఉత్తీర్ణత ఫలితాలలో అత్యుత్తమ స్థాయిని కలిగి ఉన్నది. అయితే గత కొంతకాలంగా ఈ హైస్కూల్‌ పై అంతస్తులలో మహిళా కళాశాల కూడా ప్రత్యేకంగా ఏర్పరిచి స్త్రీ విద్య, స్త్రీలకు సమాన హక్కులు కలిగించాలనే గాంధీజీ కన్న కలలను సాకారం చేసే దిశలో పయనిస్తోన్నది గాంధీజీ మునిసిపల్‌ హైస్కూల్‌. ఇక్కడ చదువు అభ్యసించిన ఎందరో మహానుభావులు: ఈ స్కూల్‌లో విద్య అభ్యసించిన వారిలో ఎందరో మహానుభావులు, మరెందరో ఉన్నత ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్‌ ఉద్యోగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటులు ఎన్టీఆర్‌ 11, 12 తరగతులు ఇక్కడే అభ్యసించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు, కంచి రామారావు, విజయవాడ పశ్చిమ మాజీ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్‌ ఇక్కడే విద్య అభ్యసించినవారే. మరెందరో రాజకీయ మేథావులను, వ్యాపారులను, సంఘసంస్కర్తలను, న్యాయవాదులను, న్యాయమూర్తులను, వైద్యులను, ఐఏఎస్‌, ఐపిఎస్‌లను మేథావులను అందించినది ఘనత ఈ హైస్కూల్‌ది. విద్యార్థులు సాధించిన బహుమతులు- అవార్డులు: విద్యనభ్యసించడమే కాకుండా ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ పోటీలలో హైస్కూల్‌కు సాధించి పెట్టిన బహుమతుల సంఖ్యా కూడా గణనీయమైనదే. వారు సాధించిన వందలాది వెండి కప్పులు ఇక్కడ తగ వైభవానికి ప్రతీకలుగా నిలిచివున్నాయి. 1915లో బెజవాడ జట్టు సాధించిన ఫుట్‌బాల్‌ అవార్డు, 1946లో రింగ్‌ టెన్నిస్‌ అవార్డులు, జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలలో చేజిక్కించుకున్న మరెన్నో అవార్డులు ఇక్కడ గాజు కేసుల్లో నేటికీ భద్రంగా ఉన్నాయి. భారీ సభలు-సమావేశాల వేదిక: కేవలం విద్యాబుద్ధులకే కాక క్రీడాకారులు తర్ఫీదు పొందే ఆటస్థల వేదికైంది. నగరంలో జరిగే సభలకు, సమావేశాలకు వేదిక అయ్యింది గాంధీజీ మునిసిపల్‌ హైస్కూల్‌. మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, యజ్ఞాలు, యాగాలు, వివాహాలు, రాజకీయ సభలు, ప్రభుత్వ అధికార కార్యక్రమాలు ఇక్కడ లెఖ్కకుమించి జరిగాయి. గాంధీపార్క్‌: ఈ హైస్కూల్‌కు అభిముఖంగా గాంధీపార్క్‌ కూడా నెలకొల్పబడింది. ఇది ఆనాటి నుండి ఈనాటివరకు నగర ప్రజలకు, పిల్లలకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఆటవిడుపు స్థలంగా గుర్తింపబడింది. (చలపాక ప్రకాష్ రచన “విజయవాడ సందర్శనం” నుండి సేకరణ)
In the year 1900, at the height of the independence struggle, the jazz was chanting to Gandhiji, who was leading the national movement in earnest! The Church of South India (CSI) in Bejawada One Town has kindly handed over ten acres of land and building to the Municipality free of cost for poor children. Gandhiji Municipal High School was established here in 1914 under the name of Gandhiji in the spirit of nationalism. Gandhiji Municipal High School is a replica of the brilliant architectural skill. In the style of the British rulers, the building was erected in the shape of an English letter 'U' facing the fort. The building, which is made of car stone and limestone, is dazzling as the wood has not been scattered for hundreds of years. At that time education was going on till 12th class. In Nandigama, Krishnajilla, only Gandhiji in One Town had the opportunity to study up to 12th class. Until 1986, education was taught here up to 12th class. Later the primary, secondary and higher education systems were dismantled and limited to the tenth class. Being a twelfth grade level, the school has enormous lab assets. There are still ancient skeletons and animal remains. The high school, which is currently run by 500 students, has been running in Telugu and English mediums since 1993. Municipal high school has the highest level of student passing results. However, for some time now, Gandhiji Municipal High School has been moving towards realizing Gandhiji's dream of setting up a special women's college on the upper floors of the high school and giving women education and equal rights to women. Many dignitaries who have studied here: Many of those who have been educated in this school are dignitaries, while others hold key responsibilities in higher government departments and in private employment. Former Chief Minister and famous film actor NTR studied 11th and 12th classes here. Former Deputy Chief Minister Koneru Rangarao, Kanchi Rama Rao and former Vijayawada West legislator Jalil Khan were educated here. This high school is credited with providing other political geniuses, businessmen, social reformers, lawyers, judges, doctors, IAS, IPS and geniuses. Prizes Achieved by Students- Awards: Apart from studying, the number of prizes won by the students studying here for high school in various competitions is also significant. The hundreds of silver cups they achieved stand as symbols of due glory here. The Bejwada team won the football award in 1915, the ring tennis awards in 1946, and many other awards at national and state sports events are still preserved in glass cases. Huge House-Meeting Venue: A playground for athletes, not just academics. Gandhiji Municipal High School is the venue for meetings and conferences held in the city. For more spiritual activities, rituals, sacrifices, weddings, political gatherings and government functions were held here. Gandhi Park: Gandhi Park has also been set up overlooking this high school. It has been a popular holiday destination for city dwellers and children ever since. (Collection from Chalapaka Prakash's "Visit to Vijayawada")
k
khawaja syed on Google

my school... ❤

Write some of your reviews for the company Gandhiji Municipal Corporation High School

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *

Nearby places Gandhiji Municipal Corporation High School