Sri Chenna kesava Swami Temple - Uppuluru

4.6/5 based on 8 reviews

Contact Sri Chenna kesava Swami Temple

Address :

Uppuluru, Andhra Pradesh 534199, India

Phone : 📞 +9998
Postal code : 534199
Website : http://uppuluruchennakesavaswamitemple.weebly.com/
Categories :

Uppuluru, Andhra Pradesh 534199, India
O
Om Namo Venkatesaya on Google

ఉండి గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో భీమవరం కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉప్పులూరు గ్రామం ... చుట్టూ పచ్చటి చెట్లతో పట్టుచీర కట్టినట్టు పచ్చదనంతో ఉంటుంది ఈ గ్రామం పేరుకి చిన్న గ్రామం అయిన గాని ఈ గ్రామానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకోవలసినది శ్రీ చెన్నకేశవాలయం గురించి ఈ ఆలయం అతి ప్రాచీన ఆలయం. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే వేదమంత్రాలు చెవులకి ఇంపుగా వినిపిస్తాయి. అయితే ఈ మంత్రోచ్చారణ చేసేది బ్రహ్మణ పండితులు కాదు, హరిజన ( దళిత ) పండితులు. స్వామివారికి నిత్య నైవేద్య ధూపదీపాలు వారే నిర్వహిస్తారు. ఇలా దేవాలయాలకు హరిజన దాసులు అర్చకులుగా ఉండటం చాలా అరుదు. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, పల్నాడులో ధూప, దీప, నైవేద్యాలతో నిత్య పూజలందుకునే చెన్నకేశవస్వామి ఆలయంలో పల్నాటి యుద్ధ సమయంలో దాడులు జరిగాయని... ఆ సమయంలో స్వామిని కాపాడుకోవడానికి కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు, అతని సోదరులు కలిసి స్వామి ప్రతిమను సింహాచలం తరలించి స్వామికి అప్పల స్వామి అని పేరు మార్చారు. అనంతరం అక్కడి నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు చేరుకున్నారు. అప్పుడు ఈ గ్రామంలో ఒక మర్రి చెట్టు నీడలో ప్రతిమను ఉంచి, స్వామికి నైవేద్యం తీసుకురావడానికి గ్రామంలోకి వెళ్లారు. అదేసమయంలో ఈ గ్రామంలో కొందరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అప్పుడు హరిజనులు మన గ్రామంలోకి అడుగుపెట్టినందుకు ఇలా జరిగిందని భావించిన గ్రామస్థులు నారాయణదాసు, అతని సోదరులను నిర్బదించారు. ఇక ఆ రోజు రాత్రే సింహాచల అప్పన్న గ్రామ పెద్దలకు కలలో కనిపించి వారు నిరపరాదులు వారిని విడిచిపెట్టమని... గ్రామంలోని మర్రిచెట్టు క్రింద తన ప్రతిమ ఉందని, స్వామి వారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించి తనకు దీప నైవేద్యాలు హరిజన దాసులే అర్చకులుగా ఉండాలని ఆదేశించారట. ఇలా ఆ స్వామివారి ఆజ్ఞ ప్రకారం గ్రామా పెద్దలు 1335 లో ఈ ప్రాంతంలో అప్పలస్వామి ఆలయం నిర్మించి ప్రతిష్టించి అర్చకులుగా వారికీ స్థానం కల్పించారు. నిజానికి విగ్రహాం చెన్నకేశవుడిదే కాబట్టి 1868 లో ఈ అప్పలస్వామి కి పూర్వపు నామమైన చెన్నకేశవస్వామిగా మరల నామకరణం చేసారు. కొన్ని తరాలు అయిన తర్వాత శ్రీ స్వామి వారి అనుగ్రహం వల్ల గ్రామము పెద్దదై సుసంపన్నమై సరస్వతి దేవి లక్ష్మీదేవి నిలయమై చుట్టుప్రక్కల గ్రామాల కంటే ఎంతో అభివృద్ధి చెందటం జరిగింది.క్రమేపి ఈ గ్రామాల వారు ఇతర సుసంపన్నమైన కుటుంబాలతో వివాహ సంబoధాలు ఏర్పాటు చేసుకోవడం , ఆ ఇతర గ్రామాల సంపన్నులు దేవాలయానికి వచ్చి శ్రీ స్వామి వారిని దర్శించి ఇక్కడ అర్చకులు హరిజనులు అని తెలుసుకొని గ్రామ పెద్దలతో చెప్పి వైష్ణవదాసులను మార్పించి , బ్రాహ్మణులను అర్చకత్వమునకు ఏర్పాటు చేస్తామని తెలుపగా అప్పటి గ్రామ పెద్దలు అలోచించి అర్చకులను మర్చుటకై అప్పటి సంస్థానమైన నూజీవీడు సంస్థానానికి సుమారు 1893లో ఒక అర్జిని వ్రాసి పంపగా రాజావారు అందుకు ఆమోదిస్తూ రాజముద్ర వేయగా వెంటనే ఆయన కుటుంబంలోని వారికి తీవ్ర అనారోగ్యము కలుగుట ఆ రాత్రి శ్రీ స్వామి వారు రాజా వారి స్వప్నములో కనపడి వారు నా సేవకులు వారిని మార్చితే నువ్వు , నీ రాజ్యము ఉండదు అని నిదర్శనము చూపి హెచ్చరించినారట.రాజా పార్ధసారధి అప్పారావు గారు జరిగిన పొరపాటును గ్రహించి మరునాడే వారిని పిలిపించి తానిచ్చిన తాఖీదును వెనుకకు తీసుకొని తానే స్వయంగా ఉప్పులూరికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని శ్రీ స్వామి వారికి అంగరంగ భోగములకై 40 ఎకరములు భూదానం ఇచ్చారు.అందు రెండు భాగములు అర్చకులకు , ఒక భాగము శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవములకు అని పెద్దలు నిర్ణయించడం జరిగిందని చెబుతారు... ఈ గ్రామంలో 1930 లో గానుగు సిమెంట్ తో కట్టిన కట్టడాలు గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి.
Located at a distance of 8 km from the village of Bhimavaram, Uppalur is a small village. This is the oldest temple in Sri Chennakesavalayam. Upon entering the temple, the Vedic mantras are heard in the ear. However, it is not the Brahmin scholars but the Harijans (Dalit) scholars who perform this enchantment. The perpetual incense burners are conducted by the Swami. It is very rare that the Harijan slaves were priests for the temples. When it comes to the history of the temple, the Chennakesavaswamy temple was attacked during the Palnati war for the eternal worship of Dhupa, Deepa and Naivedya in Palnadu. From there, we reached the West Godavari district of Uppalur. Then, they placed a statue in the shade of a banyan tree and went to the village to bring it to the Lord. At the same time, some of the people in this village are in serious condition. Narayanadasu and his brothers were taken aback by the villagers who thought that this had happened because the Harijans had entered our village. Later that night, the elders of the village of Simhachala dreaming of a dream, they left it to the innocent ... The statue of him under the village Marrikettu, and the Swami erected a temple and ordered him to be the priests of Harijana Dasu. At the behest of the Swami, the elders of the village built the Appalaswamy Temple in the year 1335 and placed them as priests. Since the idol was originally Chennakeshava, it was renamed again in 1868 as the former name of Appalaswamy. A few generations later, the blessings of Sri Swamy made the village much larger and more prosperous than the surrounding villages of Saraswati Devi Lakshmi Devi. In 1893, the Raja Swamyas received a felicitation from their family and soon afterwards, the Raja Samudra recalled them as a family. My servants have shown them that you will not be your kingdom when you change them. It is said that the elders had decided that two parts were for the priests and one part for the wedding ceremony of Sri Swamy ... The village is famous for its 1930s cement with special cement.
Y
Yashwanth kumar on Google

Its awesome
s
sai rockj on Google

Nice
M
Mr【ツ】ßB on Google

My birth place
J
Jagadish Vanumula on Google

Uppuluru famous temple
m
mannoj k on Google

Great Historic Temple of Lord Chenna Kesava
Y
Yerra Venkata rajani on Google

It's my village I feel happy
P
Polapragada Murthy on Google

This very ancient temple built in 1365, is a must visit.

Write some of your reviews for the company Sri Chenna kesava Swami Temple

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *