Sri Ramalingeswra Temple - Uppangala

3.8/5 based on 6 reviews

Contact Sri Ramalingeswra Temple

Address :

Injaram - Uppongala Rd, Uppangala, Andhra Pradesh 533464, India

Phone : 📞 +999
Postal code : 533464
Categories :

Injaram - Uppongala Rd, Uppangala, Andhra Pradesh 533464, India
L
Lakshmi Oleti on Google

p
prasanth konduri on Google

k
kk mangapathi on Google

శ్రీ రామలింగేశ్వర లింగము, మేషరాశి, భరణి నక్షత్రం (4వ పాదం) ఉప్పంగల గ్రామం, తాళ్ళరేవు మండలం. EG Dist. ఉప్పంగల గ్రామం శ్రీ రామచంద్రుడు నడయాడిన ప్రదేశంగా ప్రతీతి. త్రేతాయగములో శ్రీరాముడు అరణ్యవాసం సందర్భముగా కొన్ని సంవత్సరాలు దండకారణ్యంలో గడిపాడు. గోదావరి నది పరిసర ప్రాంతంలో సీతా లక్ష్మణుల సమేతంగా కొంత కాలము రామచంద్రుడు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకనాడు రావణ బ్రహ్మ సహోదరి అయిన శూర్పణఖ రాముణ్ని చూసి ఇష్టపడింది. ఆ శూర్పణఖ పెళ్లి చేసుకోమనీ రాముడుని అడుగుతుంది. అప్పుడు రాముడు ఆమెను లక్ష్మణుడు వద్దకు పంపుతాడు. లక్ష్మణుడు కత్తితో శూర్పణఖ చెవులూ, ముక్కూ కోస్తాడు. ఆ చుప్పనాతి (శూర్పణఖ) శరీర అంగములు పడిన ప్రాంతము " చుప్పంగల " అనె పేరుతో పిలువబడింది. కాలక్రమేణా చుప్పంగల ప్రాంతము " ఉప్పంగల " గా మారింది. లక్ష్మణుడు వినియోగించిన కత్తిని, సమీపంలో గల చెరువులో కడిగినాడు. ఇప్పటికి ఆ చెరువు నీరు కొద్దిగా ఎర్రజీరతో కనిపిస్తుంది. శ్రీరాముడు దండకారణ్యంలో పాదచారై సంచురించు సమయంలో స్ధానిక చెరువులో సంధ్యావందనం గావించి, ఒక సైకత లింగ ప్రతిష్ట గావించినట్లు స్ధల పురాణం చెప్పుతుంది. ఆలయ ప్రాంగణం విశాలముగా ఉంటుంది. ప్రవేశ ద్వారం దాటగానే ధ్వజస్తంభం, ముఖ మండపం, ద్వారపాలకులు, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ రామలింగేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామికి ఎడమ భాగమున పార్వతీ దేవి కొలువై ఉన్నాది. స్వామి వారికి నిత్య అభిషేకాలు, అర్చనలుతో పాటు నక్షత్ర దోషములకు అభిషేక శాంతులు నిర్వహించుతారు. అంతరాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ దేవి విగ్రహములున్నాయి. నంది మండపం నందలి నంది విగ్రహమును చర (తిప్పుడు) నంది అని సంభోదించుతారు. గ్రామము లోని స్త్రీలు ప్రసవ సమయములో బిడ్డ అడ్డం తిరిగి, కాన్పు కష్టమయినప్పుడు ఆమె భర్త ఆలయం నందలి చర నందిని తన ఇంటి ముఖంగా తిప్పుతాడు. చర (తిప్పుడు) నంది చల్లని చూపుతో అతని భార్యకు సుఖ ప్రసవం జరుగుతుంది అని నమ్మకం. శ్రీ రామలింగేశ్వర లింగమును మేషరాశి లోని భరణి నక్షత్రం (4వ పాదం) చెందిన ప్రతిష్టగా చెప్పుచుంటారు. భరణి నక్షత్రం 4 వ పాదములో జన్మించిన శిశువునకు దోషం ఉంటుంది. ఆ నక్షత్ర దోషములు నివారించుటకు శాంతులు జరిపించుతారు. ఉప్పంగల గ్రామం లోని శ్రీ రామలింగేశ్వర లింగము నకు అభిషేక శాంతులు జరిపించుట శ్రేష్టం. కాకినాడ నుంచి యానాం కు బస్సులు (Via) చొల్లంగి, తాళ్ళరేవు, నీలపల్లి మీదగా ప్రతి గంటకు ఉంటాయి. యానాం పట్టణంలో యాత్రికులకు మంచి వసతులు దొరుకుతాయి. యానాం పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతము లోనికి వస్తుంది. యానాం బస్ స్టాండ్ నుంచి యానాం బైపాస్ రోడ్ కు ఆటోలు ఉంటాయి. * కాకినాడ - అమలాపురం (Non-Stop) బస్ సర్వీసులు direct గా యానాం బైపాస్ రోడ్ మీదగా ఉంటాయి. * యానాం బైపాస్ రోడ్ (Sri Ravi Junior & Degree College, Near Yanam Bi Pass Sunkarapalem, Andhra Pradesh) నుంచి ఉప్పంగల గ్రామం నకు ఆటోలు ఎక్కువుగా దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 2 kms. వీటిని (ఆటో) రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది సౌక్యముగా ఉంటుంది.
Sri Ramalingeswara Lingamu, Aries, Bharani star (4th leg) Uppangala village, Thalarevu zone. EG Dist. Uppangala village is famous for the place where Sri Ramachandra walked. In Tretayagamu, Lord Rama spent some years in Dandakaranya during his wilderness stay. Ramachandra settled with Sita Lakshmana for some time in the vicinity of the river Godavari. One day Ravana fell in love with Surpanakha Ramu, the sister of Brahma. The Surpanakha asks Lord Rama to marry him. Then Lord Rama sends her to Lakshmana. Lakshmana cuts off Surpanakha's ears and nose with a sword. The area where the body parts of the chuppanati (shurpanakha) fell was called "chuppangala". Over time, the Chuppangala area became "Uppangala". Lakshmana washed the used sword in a nearby pond. So far that pond water looks a little reddish. According to local legend, Lord Rama sang Sandhyavandanam in a local pond during his pilgrimage to Dandakaranya and recited a Saikata Linga prestige. The temple courtyard is spacious. Just past the entrance are the flagpole, the front porch, the gatekeepers, the sanctuary, and the sanctuary. Sri Ramalingeswara Lingam is seen in the sanctum sanctorum. To the left of the Swami is Goddess Parvati. Swami performs daily anointings and worships for them as well as anointing peace for stellar faults. There are idols of Ganapati, Subramanya Swamy and Goddess Parvati in the sanctum sanctorum. The Nandi idol in the Nandi Mandapam is referred to as Chara (Tippudu) Nandi. The women of the village return to the barrier during childbirth, and when childbirth is difficult her husband turns the chara nandi in the temple in front of his house. Chara (Tippu) Nandi believes that his wife will have a happy delivery with a cold look. Sri Ramalingeswara Lingam is said to be the prestige of the Bharani star (4th leg) in Aries. A baby born in the 4th foot of the Bharani star has a defect. Peace is made to avoid those stellar errors. Abhishek Shanthu to Sri Ramalingeswara Lingam in Uppangala village Excellent to perform. Buses (Via) from Kakinada to Yanam run every hour via Chollangi, Thalarevu and Neelapally. Travelers can find good accommodation in the town of Yanam. Yanam falls under the Union Territory of Pondicherry. Autos are available from Yanam Bus Stand to Yanam Bypass Road. * Kakinada - Amalapuram (Non-Stop) bus services are directly on the Yanam Bypass Road. * Most of the autos are available from Yanam Bypass Road (Sri Ravi Junior & Degree College, Near Yanam Bi Pass Sunkarapalem, Andhra Pradesh) to Uppangala village. The distance between them is about 2 kms. These (auto) will have to make arrangements to come and go. It is comfortable.
S
Satish on Google

Pleasant temple
S
S Ranga Bhaskar Raju on Google

Historic place beautiful
L
Lakshmi D on Google

It's a fantastic and beautiful place

Write some of your reviews for the company Sri Ramalingeswra Temple

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *